జేహర భేగం 8వ వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు

120చూసినవారు
జేహర భేగం 8వ వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు
విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమి పీఠాధిపతి డా. ఉమర్ ఆలిషా మాతృమూర్తి జేహర బేగం 8వ వర్ధంతి సందర్భంగా అజీమా జహారమ్మ సేవా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, పళ్ళు, రొట్టెలు పంపిణీ చేశారు. సంస్థ అధ్యక్షులు అహ్మద్ ఆలిషా మాట్లాడుతూ తమ తల్లి ఆశయాలను కొనసాగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో 200 మందికి, కాకినాడ ఉమా మనోవికాస కేంద్రంలోని మానసిక వికలాంగులకు, శ్రావణి వృద్ధాశ్రమంలో వృద్ధులకు ఆహారం పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. కీర్తీ ప్రియ సేవా భావనను అభినందిస్తూ, సంస్థ అందిస్తున్న సహకారం ప్రశంసనీయమని అన్నారు.

సంబంధిత పోస్ట్