ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, నేషనల్ లెప్రసీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ ఆధ్వర్యంలో ఇందిరానగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 'స్పార్ష్ కుష్టు వ్యాధి అవగాహన ప్రచార కార్యక్రమం'ను శుక్రవారం ఘనంగా ప్రారంభించింది. ఈ సందర్భంగా పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ బత్తుల జయరాం మాట్లాడుతూ, కుష్టు వ్యాధి పట్ల సమాజంలో ఉన్న అపోహలను తొలగించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని తెలిపారు.