భక్తిశ్రద్ధలతో మట్టల ఆదివారం పండుగ

855చూసినవారు
భక్తిశ్రద్ధలతో మట్టల ఆదివారం పండుగ
పిఠాపురం నియోజకవర్గంలో క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో మట్టల ఆదివారాన్ని నిర్వహించారు. ఈస్టర్ పండుగకు ముందు వచ్చే ఈ ఆదివారం యేసుక్రీస్తు యెరుషలేములోకి ప్రవేశించిన సందర్భాన్ని స్మరించుకున్నారు. పట్టణంలోని పెనూయెల్ ప్రార్థన మందిరం ఆధ్వర్యంలో భక్తులు ఈతమట్టలు చేతపట్టి హోసన్న గీతాలు ఆలపిస్తూ ప్రధాన వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పాస్టర్ ప్రేమ్ సాగర్ పాల్గొని సందేశం ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్