విద్యుత్ లైన్ల మరమ్మత్తులు, చెట్ల కొమ్మల తొలగింపు పనుల కారణంగా శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పెద్దాపురం పరిధిలోని చిత్రాడ, కుమారపురం గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏపీఈపీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎ. వి. ఎన్. డి. ఎస్. ప్రభాకర్ తెలిపారు. ఈ అంతరాయం 33/11 కేవీ పిఠాపురం సబ్‌స్టేషన్ పరిధిలోని 11 కేవీ చిత్రాడ ఫీడర్, 33/11 కేవీ కుమారపురం సబ్‌స్టేషన్ పరిధిలోని 11 కేవీ కుమారపురం ఫీడర్‌లకు వర్తిస్తుందని, వినియోగదారులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.