బురదమయంగా గొల్లప్రోలు-రాయవరం రోడ్డు

3చూసినవారు
బురదమయంగా గొల్లప్రోలు-రాయవరం రోడ్డు
కాకినాడ, పిఠాపురంలోని గొల్లప్రోలులోని రాయవరం రోడ్డును మార్కండేయపురంతో కలిపే ప్రధాన రహదారి ఇటీవల కురిసిన వర్షాల కారణంగా గుంతలు, బురదతో నిండిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతుండగా, కాలినడకన వెళ్లడానికే కష్టంగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర వాహనాల రాకపోకలకు కూడా అంతరాయం కలుగుతోందని తెలిపారు. సమస్యను పరిశీలించి తగిన చర్యలు చేపడతామని కమీషనర్ శ్రీనివాసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్