టీడీపీ పార్టీని మరింత బలోపేతం చేయడానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా కమిటీలో పిఠాపురం నియోజకవర్గ నేతలకు చోటు దక్కిన సందర్భంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే వారికే గుర్తింపు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కొత్త కమిటీతో శ్రేణుల్లో ఉత్సాహం పెరిగిందని తెలిపారు.