గంజాయి గుండాలు, మద్యం మాఫియా దాడిలో గాయపడి, చికిత్స పొందుతూ మృతి చెందిన కానిస్టేబుల్ సౌమ్యకు గురువారం రాత్రి పిఠాపురంలో కొవ్వొత్తుల నిరసన తెలిపారు. మద్యం, మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచార కమిటీ ఆధ్వర్యంలో సౌమ్య చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. మత్తు పదార్థాలు లేని సమాజాన్ని నిర్మించాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.