వన్నెపూడి విద్యార్థి చల్లారావుకు యూనివర్సిటీ గోల్డ్ మెడల్

996చూసినవారు
వన్నెపూడి విద్యార్థి చల్లారావుకు యూనివర్సిటీ గోల్డ్ మెడల్
గొల్లప్రోలు మండలం వన్నెపూడి గ్రామానికి చెందిన కందా చల్లారావు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్ స్నాతకోత్సవంలో యూనివర్సిటీ టాపర్‌గా నిలిచి గోల్డ్ మెడల్ అందుకున్నారు. మెటలర్జికల్ ఇంజినీరింగ్ విభాగంలో ఆర్జీయూకేటీ నాలుగు క్యాంపస్‌లలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఈ ఘనత సాధించారు. తెలుగు మాధ్యమంలో ప్రభుత్వ పాఠశాలలో చదివిన చల్లారావు పదో తరగతిలో 10/10 సీజీపీఏ సాధించి, అనంతరం ఆర్జీయూకేటీలో ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సును విజయవంతంగా పూర్తి చేశారు. తన విజయానికి తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజల ప్రోత్సాహమే కారణమని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్