గొల్లప్రోలు పట్టణంలోని రైల్వేస్టేషన్ వద్ద కొలువైయున్న శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణం గురువారం రాత్రి కనుల పండువగా జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య కల్యాణక్రతువును జరిపించారు. ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. అంతకు ముందు వేంకటేశ్వర స్వామి రథోత్సవం కూడా వైభవంగా జరిగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను రథంపై ఉంచి పురవీధుల్లో లాగారు. ఆలయ కమిటీ సభ్యులు ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు.