టిడిపి నాయకులతో వర్మ సమావేశం

363చూసినవారు
టిడిపి నాయకులతో వర్మ సమావేశం
పిఠాపురం పట్టణంలోని టిడిపి కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ గురువారం పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. మున్సిపాలిటీ 30 వార్డుల అధ్యక్షులతో జరిగిన ఈ సమావేశంలో పార్టీ బలోపేతంపై చర్చించారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన జెండా స్థలాల వివరాలు, ఫొటోలు ‘మై టిడిపి’ యాప్‌లో అప్లోడ్ చేయాలని సూచించారు. పార్టీ క్రమశిక్షణతో ప్రజా సమస్యల పరిష్కారానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, పేదల సమస్యలపై స్పందించి వారికి అండగా నిలవాలని, రాబోయే రోజుల్లో మరింత సమన్వయంతో పార్టీని బలపరుస్తామని వర్మ తెలిపారు. కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్