గొల్లప్రోలులో వికసిత్ భారత్ గ్రామీణ్ రోజ్‌గర్ మిషన్ ప్రారంభం

5చూసినవారు
గొల్లప్రోలులో వికసిత్ భారత్ గ్రామీణ్ రోజ్‌గర్ మిషన్ ప్రారంభం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో అమలు చేస్తున్న వికసిత్ భారత్–గ్రామీణ్ రోజ్‌గార్ & ఆజీవికా మిషన్‌ను గురువారం గొల్లప్రోలు మండలంలోని 10 గ్రామాల్లో ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఏడాదికి 125 రోజుల ఉపాధి, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన 318 రకాల పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఉపాధి హామీ కూలీని రూ. 307 నుంచి రూ. 312కు పెంచినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సెలట్ రాజు, ఏపీఓ సత్యనారాయణతో పాటు ప్రజాప్రతినిధులు, రైతులు, ఉపాధి హామీ కూలీలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్