ప్రజా సమస్యలపై పోరాడాలి: వంగా గీత

1060చూసినవారు
ప్రజా సమస్యలపై పోరాడాలి: వంగా గీత
పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని ఆ పార్టీ ఇన్ఛార్జ్ వంగా గీత పిలుపునిచ్చారు. బుధవారం పిఠాపురం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర, జిల్లా, మండల కమిటీల నాయకులతో ఆమె సమీక్ష నిర్వహించారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. కార్యకర్తలకు అండగా ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడాలని సూచించారు. పార్టీ నిర్మాణంపై నాయకులకు దిశానిర్దేశం చేస్తూ కేడర్లో ఉత్సాహం నింపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్