
సబ్బు బిళ్ళ పై వందేమాతర గీతం రచయిత ఆకృతి
గొల్లప్రోలు మండలం చెందుర్తి జెడ్పీ ఉన్నత పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయుడు పిల్లి గోవిందరాజులు, వందేమాతరం గీత రచయిత బంకిం చంద్ర ఛటర్జీ చిత్రాన్ని సబ్బుపై చెక్కి విద్యార్థులకు ప్రదర్శించారు. వందేమాతరం గీతాన్ని రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ఆయన జీవిత చరిత్రను విద్యార్థులకు వివరించారు. ఉపాధ్యాయుడు తన కళతో విద్యార్థులకు విజ్ఞానాన్ని అందిస్తున్నారు.






































