పిఠాపురం - Pithapuram

గొల్లప్రోలు: పిచ్చికుక్క దాడిలో 10 మంది గాయాలు

గొల్లప్రోలు: పిచ్చికుక్క దాడిలో 10 మంది గాయాలు

గొల్లప్రోలులో శుక్రవారం పిచ్చికుక్క దాడిలో 10 మంది గాయపడ్డారు. ప్రధాన రహదారి, వీధుల్లో నడిచి వెళుతున్న వారిపై దాడి చేయడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ముగ్గురు గొల్లప్రోలు పీహెచ్ సి, నలుగురు యూపీ పీహెచ్ సి లో చికిత్స పొందారు. మరో ముగ్గురు పిఠాపురంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు వైద్యంకోసం వెళ్లారు. ఏపీ మల్లవరంలో కోతి దాడి చేయడంతో కడిమిశెట్టి సత్యవతి తీవ్రంగా గాయపడ్డారు. రెండు రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన పెనుమల్లు సత్యవతి కూడా కోతి దాడిలో గాయపడ్డారు. ఏవీనగరం పీహెచ్ సిలో ఇద్దరూ చికిత్స పొందారు.

వీడియోలు


జోగులాంబ గద్వాల జిల్లా