
యూ. కొత్తపల్లి: మైనర్ బాలిక ఫిర్యాదుపై వ్యక్తి అరెస్ట్
యూ. కొత్తపల్లి మండలానికి చెందిన మైనర్ బాలికను ప్రేమ పేరుతో మోసం చేసిన కేసులో అంజిబాబు అనే యువకుడిని అరెస్టు చేసినట్లు సీఐ శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. బాలిక గర్భం దాల్చిన తర్వాత పెళ్లికి నిరాకరించాడని ఫిర్యాదు చేసిందని, ఈ మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.







































