
గ్యాస్ సిలిండర్ల కొరతతో ఇబ్బంది పడుతున్న ప్రజలు
పెదనందిపాడులో గ్యాస్ సిలిండర్ల కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం గ్రామాలకు సరఫరా చేయాల్సిన గ్యాస్ వాహనం రాకపోవడంతో, పరిసర గ్రామాల ప్రజలు కూడా స్థానిక గ్యాస్ ఏజెన్సీ వద్దకు చేరుకున్నారు. కార్యాలయం తెరిచినప్పటి నుండి వినియోగదారులు గంటల తరబడి క్యూల్లో నిలబడి, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.



































