ప్రత్తిపాడులో పీజీఆర్ఎస్‌కు 112 అర్జీలు

249చూసినవారు
ప్రత్తిపాడులో పీజీఆర్ఎస్‌కు 112 అర్జీలు
కాకినాడ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్తిపాడు ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 112 అర్జీలు అందాయి. 'ఒక నెల–ఒక గ్రామం–నాలుగు సందర్శనలు' కార్యక్రమంలో భాగంగా ప్రజల సమస్యలను అధికారులు స్వీకరించారు. పింఛన్లు, ఇళ్ల స్థలాల మంజూరు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై వచ్చిన అర్జీలను పరిశీలించి, అర్హమైన వాటికి త్వరగా పరిష్కారం చూపుతామని అధికారులు తెలిపారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు కార్యాలయంలో మొక్కలు నాటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్