కత్తిపూడి జాతీయ రహదారిపై శనివారం రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో బైకులు పూర్తిగా దెబ్బతిన్నాయి. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.