ఏలేరు రిజర్వాయర్ పవర్ ప్లాంట్ బిట్-2 సమీపంలో బుధవారం ఒక వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మత్స్యకారుల సమాచారం మేరకు మత్స్యశాఖ అధికారి రాజేంద్రరావు బోట్ల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడు జడ్డంగి అన్నవరం గ్రామానికి చెందిన వ్యక్తి అని ఎస్సై రామలింగేశ్వరరావు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.