శంఖవరం మండలం అన్నవరంలో కొలువై ఉన్న వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో శుక్రవారం ఆలయ ఇంఛార్జ్ ఈవో చక్రధరరావు ప్రసాద విభాగంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. భక్తులకు అందజేస్తున్న అన్నప్రసాదం నాణ్యత, పరిశుభ్రత, వంటశాల నిర్వహణ, ఆహార పదార్థాల నిల్వ విధానాలను ఆయన పరిశీలించారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు.