అన్నవరం దేవస్థానం ఆధ్వర్యంలో డిగ్రీ, జూనియర్ కళాశాల విద్యార్థులకు గురువారం ఉచిత మధ్యాహ్న భోజన పథకాన్ని ఈవో నల్ల సూర్య చక్రధరరావు ప్రారంభించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని,
విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, అధ్యాపకులు,
విద్యార్థులు పాల్గొన్నారు.