అన్నవరం దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న సత్యదేవ డిగ్రీ కళాశాలలో జనవరి 31న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ రామ్మోహనరావు తెలిపారు. పదోతరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమో, బీఎస్సీ, బీటెక్ ఉత్తీర్ణులై, 36 ఏళ్లలోపు వయసున్నవారు ఈ మేళాలో పాల్గొనడానికి అర్హులు. ఉదయం 9 గంటలకు అవసరమైన ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 8074444217, 8008872860 నంబర్లను సంప్రదించవచ్చు.