టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో కొప్పన మాధవరావుకు సన్మానం

316చూసినవారు
టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో కొప్పన మాధవరావుకు సన్మానం
కాకినాడ, ప్రత్తిపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా, MyTdp డిజిటల్ ప్లాట్ఫార్మ్ మరియు సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమాల్లో అద్భుతంగా పనిచేసి మొదటి స్థానంలో నిలిచిన కొప్పన మాధవరావుని శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ రాజా సన్మానించారు. ఒమ్మింగి గ్రామానికి చెందిన మాధవరావుకు ఈ అరుదైన గౌరవం దక్కింది. యువత అందరూ పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిఎన్ఎస్ఎఫ్ సెక్రటరీ కోప్పన నాని, రామ్ శెట్టి మునశేబ్, సుంకర భవాని, పోటు నానీ, సూరిబాబు, గ్రామ టిడిపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్