రౌతులపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో నూతన లేబరేటరీ వైద్య పరికరాలను ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, ఈ పరికరాలు రోగ నిర్ధారణకు, అత్యవసర పరీక్షలకు ఎంతగానో ఉపయోగపడతాయని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తెస్తున్నామని ఆమె పేర్కొన్నారు.