పేదరిక నిర్మూలనలో పీ-4 భాగస్వామ్యం కీలకం: ఎమ్మెల్యే సత్యప్రభ
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండల పరిషత్ కార్యాలయంలో పి-4 కార్యక్రమం సంవత్సరం పూర్తయిన సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పాల్గొన్నారు. పేదరిక నిర్మూలనలో పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ భాగస్వామ్యం కీలకమని ఆమె తెలిపారు. నియోజకవర్గంలో 11,420 కుటుంబాలను గుర్తించి, 6,535 కుటుంబాలకు ఇప్పటికే దత్తత తీసుకుని సహాయం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
