చిన్నారుల ఆరోగ్యానికి పోలియో చుక్కలు తప్పనిసరి

937చూసినవారు
చిన్నారుల ఆరోగ్యానికి పోలియో చుక్కలు తప్పనిసరి
పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచిలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. పోలియో రహిత గ్రామాల నిర్మాణమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. పిల్లల ఆరోగ్య పరిరక్షణలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని సూచించారు. కత్తిపూడి బస్టాండ్, వజ్రకుటం రామాలయం వద్ద నిర్వహించిన శిబిరాల్లో టీడీపీ నాయకులు వెన్నా శివ, కీర్తి సుభాష్ చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.

సంబంధిత పోస్ట్