గంజాయి రవాణా, వినియోగంపై సమాచారమివ్వండి: ఎస్సై

1206చూసినవారు
గంజాయి రవాణా, వినియోగంపై సమాచారమివ్వండి: ఎస్సై
ప్రత్తిపాడు ఎస్సై లక్ష్మీకాంతం, ఒమ్మంగిలో మత్తు పదార్థాల వినియోగంపై స్థానికులకు అవగాహన కల్పించారు. గంజాయి రవాణా, వినియోగంపై సమాచారం ఉంటే 1972 లేదా 112 టోల్ ఫ్రీ నంబర్లకు తెలియజేయాలని సూచించారు. సమాచారం ఇచ్చేవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్