రత్నగిరిపై రామనామ స్మరణ

295చూసినవారు
రత్నగిరిపై రామనామ స్మరణ
అన్నవరం పుణ్యక్షేత్రంలో శ్రీ సీతారామ చంద్రమూర్తి వారి దివ్య కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా గురువారం పంప సరోవరం తీరాన చక్రస్నాన మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పంప సరోవరం వద్ద ఉన్న మండపాన్ని రంగురంగుల పుష్పాలు, హరిత పత్రాలతో అలంకరించారు. అలంకృత మండపంలో శ్రీ సీతారాముల వారిని, శ్రీ సత్యనారాయణ స్వామి, అనంతలక్ష్మి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఆశీనులను గావించారు. ఒకే వేదికపై ఇరు దైవ స్వరూపాలు కొలువుదీరడం భక్తులకు కనువిందు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్