కాకినాడ, ప్రత్తిపాడు (తూ.గోదావరి)లో కొలువై ఉన్న అన్నవరం సత్యదేవుని నిత్య అన్నదానం పథకానికి వైజాగ్ వాస్తవ్యులు వి. చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు గురువారం రూ. 1,00,000 విరాళంగా సమర్పించారు. ఈ సందర్భంగా దాతలు స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు వేద ఆశీర్వాదాలు అందజేయగా, ఆలయ సిబ్బంది స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు.