అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో నిత్య అన్నదాన పథకానికి విజయవాడకు చెందిన పితాని జోగేష్ వర్మ రూ. 1,00,116 విరాళంగా అందించారు. ఈ విరాళంపై వచ్చే వడ్డీతో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 24న పితాని జోగేష్ వర్మ, నాగజ్యోతి పేర్లపై అన్నదానం నిర్వహించాలని ఆయన కోరారు. దేవస్థానం తరఫున అసిస్టెంట్ పీఆర్‌ఓ గణపతి అన్నదాన విరాళ బాండ్‌ను అందజేశారు. భక్తుల విరాళాలతో అన్నదాన పథకం విజయవంతంగా కొనసాగుతోందని ఆలయ అధికారులు తెలిపారు.