నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఎంవీఐ సోనీ ప్రియ

690చూసినవారు
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఎంవీఐ సోనీ ప్రియ
శంఖవరం మండలం కత్తిపూడిలో శుక్రవారం మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ సోనీ ప్రియ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. రహదారి భద్రతకు భంగం కలిగించే విధంగా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. టిప్పర్లు, లారీల రికార్డులను పరిశీలించి, అవసరమైన పత్రాలు లేని వాహనాలపై కేసులు నమోదు చేశారు. డ్రైవర్లు, యజమానులకు వేగ పరిమితిని పాటించాలని, అధిక లోడుతో వాహనాలు నడపవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ గౌరీశంకర్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్