సూర్యోదయ సంస్థ అండ: తలసేమియా బాలుడికి ప్రాణదానం

628చూసినవారు
సూర్యోదయ సంస్థ అండ: తలసేమియా బాలుడికి ప్రాణదానం
తుని మండలం మమత హాస్పిటల్లో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న 8 ఏళ్ల రామసత్య అనే బాలుడికి సూర్యోదయ సంస్థ అండగా నిలిచింది. నాలుగు రోజులుగా AB పాజిటివ్ రక్తం దొరకక ఇబ్బందులు పడుతున్న బాలుడి తల్లిదండ్రుల ఆవేదనను గమనించి, మదర్ బ్లడ్ బ్యాంక్ సహకారంతో సూర్యోదయ సంస్థ రక్తాన్ని ఏర్పాటు చేసి, బాలుడి ప్రాణాలను కాపాడింది. రక్తదానం ప్రాణదాతలుగా నిలవాలని, మంచి మనసుతో చేసే ఈ దానం గొప్పదని పలువురు సూర్యోదయ సంస్థను అభినందించారు.