ఆవు దూడలకు పుట్టినరోజు వేడుక జరిపిన టీడీపీ శ్రేణులు

108చూసినవారు
ఆవు దూడలకు పుట్టినరోజు వేడుక జరిపిన టీడీపీ శ్రేణులు
ప్రత్తిపాడు నియోజకవర్గంలోని చిన శంకర్లపూడి గ్రామంలో, రెండేళ్ల క్రితం జన్మించిన మిరియాల వెంకటరాజుకు చెందిన ఆవు దూడలైన రామలక్ష్మణులకు టీడీపీ నాయకులు మిరియాల శ్రీను ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు వైస్ ఛైర్మన్ కొమ్ముల కన్నబాబు, సొసైటీ ఛైర్మన్ వరుపుల రామకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్