Oct 12, 2025, 09:10 IST/
మహిళా జర్నలిస్టులకు ముత్తాఖీ ఆహ్వానం
Oct 12, 2025, 09:10 IST
ఆఫ్ఘనిస్థాన్ విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముత్తాఖీ ఢిల్లీలో ఈరోజు నిర్వహించిన తాజా ప్రెస్ మీట్‌కు మహిళా జర్నలిస్టులను ఆహ్వానించారు. శుక్రవారం జరిగిన ప్రెస్ మీట్‌కు మహిళా జర్నలిస్టులను అనుమతించకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై తాలిబన్ అధికారి మాట్లాడుతూ పాస్‌ల సంఖ్య పరిమితంగా ఉండటంతో కొందరినే ఆహ్వానించామని, మహిళలపై వివక్ష చూపలేదని వివరణ ఇచ్చారు. ఈ వ్యవహారంలో తమ ప్రమేయం ఏమీ లేదని కేంద్రం పేర్కొంది.