116 రోజులు సమ్మర్ బ్లడ్ డ్రైవ్: రక్తదానం మన బాధ్యత

962చూసినవారు
116 రోజులు సమ్మర్ బ్లడ్ డ్రైవ్: రక్తదానం మన బాధ్యత
మన బాధ్యత ఫౌండేషన్ రాజమండ్రి సిటీ అధ్యక్షురాలు గారా శ్రీవిద్య రాణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమ్మర్ బ్లడ్ డ్రైవ్ మంగళవారం 116వ రోజుకు చేరుకుంది. రక్తదానం నిరంతర కృషి అని, ప్రాణాలు కాపాడటానికి యువతలో అవగాహన కీలకమని, ప్రజల సంపూర్ణ మద్దతుతో మరింత ఉత్సాహంగా పనిచేస్తామని శ్రీవిద్య రాణి తెలిపారు. రక్తదాతలు ప్రత్యేకంగా జన్మించరని, అందరూ రక్తదానం చేయాలని, అది మన బాధ్యత అని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సిటీలో కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్