తూ. గో జిల్లాలో నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో మొదటి రెండు రోజులలో లక్ష్యంగా నిర్దేశించిన చిన్నారుల్లో 95.20% మందికి పోలియో చుక్కలు వేశారు. మిగిలిన చిన్నారులకు సోమవారం ఇంటింటికీ వెళ్లి చుక్కలు వేసే కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో 2,47,300 గృహాలను సందర్శించి, 23,293 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా. వసుంధర తెలిపారు.