రాజమహేంద్రవరం మహిళా కళాశాలలో అకడమిక్ ఆడిట్ విజయవంతం

664చూసినవారు
రాజమహేంద్రవరం మహిళా కళాశాలలో అకడమిక్ ఆడిట్ విజయవంతం
రాజమహేంద్రవరం కందుకూరి రాజ్యలక్ష్మి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో (30-03-26) వార్షిక అకడమిక్ ఆడిట్ 2025-26 విజయవంతంగా నిర్వహించబడింది. ప్రిన్సిపాల్ డా. ప్రభల శ్రీవల్లి పర్యవేక్షణలో, కమిషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు జరిగిన ఈ ఆడిట్‌లో, మండపేట నుండి డాక్టర్ ఎం.ఎస్.వి. కిరణ్ కుమార్, రావులపాలెం నుండి డాక్టర్ యు. సుభాషిని అడ్వైజర్లుగా వ్యవహరించారు. వీరు బోధన, మౌలిక సదుపాయాలు, NAAC ప్రమాణాలను పరిశీలించి, మెరుగుదలలపై అధ్యాపకులకు సూచనలు అందించారు. అనంతరం అడ్వైజర్లకు సన్మానం జరిగింది.

సంబంధిత పోస్ట్