రాజమండ్రి బెటాలియన్ లో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు.

1చూసినవారు
రాజమహేంద్రవరం లోని పోలీసు 4వ బెటాలియన్ ప్రధాన కార్యాలయంలో శనివారం అమర వీరుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి 4వ బెటాలియన్ ఇన్‌చార్జి కమాండెంట్ ఎస్. దేవానందరావు అధ్యక్షత వహించి, అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సహాయ కమాండెంట్లు ఎల్. ఎస్. కె. డి. వి. ప్రసాద్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్