రాజమండ్రిలో ఏపీ ల్యాండ్ & సర్వే డిపార్ట్‌మెంట్ జాయింట్ డైరెక్టర్ సిహెచ్ విఎస్ఎన్ కుమార్‌ను జిల్లా విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ సభ్యుడు గొట్టిముక్కల అనంతరావు శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా అనంతరావు, రాష్ట్రంలో భూమి రీసర్వే కార్యక్రమాన్ని జేడీ కుమార్ విజయవంతంగా అమలు చేస్తున్నారని కొనియాడారు. ప్రజల భూ సమస్యలను అధికారులు నిర్లక్ష్యం వహించకుండా త్వరితగతిన పరిష్కరించాలని ఆయన కోరారు.