మన బాధ్యత ఫౌండేషన్ రాజమండ్రి సిటీ అధ్యక్షురాలు గారా శ్రీవిద్య రాణి ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మర్ బ్లడ్ డ్రైవ్ గురువారం 34వ రోజుకు చేరుకుంది. ప్రజల్లో రక్తదానం పట్ల అవగాహన కల్పించేందుకు నిరంతరాయంగా కృషి చేస్తున్నామని, రక్తదాతలు ముందుకు వచ్చి రక్తదానం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఆమె చేస్తున్న ఈ మంచి ప్రయత్నాన్ని పలువురు అభినందిస్తున్నారు.