సేవా రత్న అవార్డుతో బత్తుల ప్రవీణ్ కుమార్ సన్మానం

223చూసినవారు
మన బాధ్యత ఫౌండేషన్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు బత్తుల ప్రవీణ్ కుమార్ చేస్తున్న నిస్వార్ధ సమాజ సేవకు గాను, తిరుపతికి చెందిన శ్రీపతి చారిటబుల్ ట్రస్ట్ వారు శనివారం తిరుపతిలో జాతీయ ఉత్తమ సేవా రత్న అవార్డును అందించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, ఫౌండేషన్ ద్వారా రక్తదానం, పర్యావరణ పరిరక్షణ, రోడ్డు భద్రత, విద్యార్థులకు కెరీర్ గైడెన్స్, పేదవారికి సహాయం వంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, ఈ అవార్డు రావడం సంతోషంగా ఉందని, ప్రజల సహకారం కోరారు.