రాజమండ్రిలోని ప్రభుత్వ సమగ్ర బోధనాసుపత్రిలో గురువారం BEGNM నర్సింగ్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. పి. వి. వి. సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం, ఈ పరీక్షలు ఫిబ్రవరి 13వ తేదీ వరకు కొనసాగుతాయి. జిల్లాలోని సుమారు 20 ప్రైవేటు నర్సింగ్ కళాశాలలకు చెందిన దాదాపు 900 మంది విద్యార్థులు (ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్) పరీక్షలకు హాజరవుతున్నారు. పరీక్షలు సజావుగా, పారదర్శకంగా నిర్వహించడానికి అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.