ప్రజల సమస్యలపై బీజేపీ "జనతా వారధి"

165చూసినవారు
ప్రజల సమస్యలపై బీజేపీ "జనతా వారధి"
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 'మీ సమస్య… మా బాధ్యత' నినాదంతో 'జనతా వారధి' కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని పార్టీ కార్యాలయంలో ప్రజల నుండి వినతులను స్వీకరించి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర కార్యదర్శి బొమ్ముల దత్తు పాల్గొన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఈ కార్యక్రమం నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్