రాజమండ్రిలో బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

2198చూసినవారు
రాజమండ్రిలో బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
రాజమహేంద్రవరంలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా జిల్లా బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం జరిగింది. 'రక్తదానం – ప్రాణదానం' స్ఫూర్తితో యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని నాయకులు సోమవారం పిలుపునిచ్చారు. రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎంపీ పురందేశ్వరి ఈ కార్యక్రమంలో పాల్గొని, రక్తదానం చేసిన యువతను అభినందించారు. ఆపదలో ఉన్నవారికి రక్తదానం ద్వారా అండగా నిలుస్తున్న యువత సేవాభావాన్ని ఎంపీ ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్