రాజమండ్రిలో క్యాన్సర్ అవగాహన ర్యాలీ: మహిళల్లో వ్యాధులపై ప్రచారం

784చూసినవారు
రాజమండ్రిలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఆధ్వర్యంలో వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మహిళల్లో ఎక్కువగా కనిపించే క్యాన్సర్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు. స్థానిక రామాలయం సెంటర్ నుంచి ఐఎంఏ హాలు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వైద్యులు, నర్సులు, విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని క్యాన్సర్ నివారణ, ముందస్తు గుర్తింపు అవసరంపై ప్రజలకు సందేశం ఇచ్చారు. మహిళలు ఆరోగ్య పరీక్షలు తరచుగా చేయించుకోవడం ద్వారా క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స పొందవచ్చని వైద్యులు సూచించారు.

సంబంధిత పోస్ట్