EVM గోదాం త్రైమాసిక తనిఖీ నిర్వహించిన కలెక్టర్ కీర్తి చేకూరి

1084చూసినవారు
EVM గోదాం త్రైమాసిక తనిఖీ నిర్వహించిన కలెక్టర్ కీర్తి చేకూరి
భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం, సోమవారం రాజమహేంద్రవరంలోని ఎఫ్‌సీఐ ప్రాంగణంలో ఉన్న ఈవీఎం గోదాంను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కీర్తి చేకూరి త్రైమాసిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా గోదాంలో భద్రపరిచిన ఈవీఎంల భద్రతా ఏర్పాట్లు, సీసీటీవీ పుటేజ్, రికార్డులను పరిశీలించి, ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు అన్ని భద్రతా చర్యలు పకడ్బందీగా అమలులో ఉన్నాయని నిర్ధారించారు. ఈ తనిఖీ ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను, భద్రతను నిర్ధారించడంలో భాగంగా జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్