రాజమండ్రి రూరల్ మండలం కొలమూరులో మంగళవారం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమాన్ని కలెక్టర్ కీర్తి చేకూరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. బీఎల్‌వోలు ఓటరు ఎన్యూమరేషన్ ఫారాలను ఎలా పరిశీలిస్తున్నారో, డేటా ఎంట్రీ, డిజిటలైజేషన్ ప్రక్రియను ఆమె అడిగి తెలుసుకున్నారు. విధుల నిర్వహణలో బీఎల్‌వోలు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు.