రాజమండ్రి రూరల్ మండలం పిడింగొయ్యి పంచాయతీ పరిధిలోని 612 సర్వే నెంబర్‌పై సమగ్ర విచారణ జరిపించి, భూమి కబ్జాకు గురైతే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రాజమండ్రి నగర టీడీపీ అధ్యక్షులు మజ్జి రాంబాబు కలెక్టర్ కీర్తి చేకూరిని కోరారు. టీడీపీ నాయకులతో కలిసి ఆయన కలెక్టర్‌కు ఫిర్యాదు అందజేశారు. దీనిపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.