తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ పరిధిలోని కడియం జెడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం సౌత్ జోన్ ఈగల్ బృందం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో సైబర్ నేరాలు, సోషల్ మీడియా వాడకంలో జాగ్రత్తలు, మహిళలు, బాలికల భద్రతపై సుమారు 70 మంది
విద్యార్థులు, ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసులను ఎలా సంప్రదించాలో కూడా వివరించారు.