తూర్పుగోదావరి పోలీసుల షార్ట్ ఫిల్మ్ పోటీలు

243చూసినవారు
తూర్పుగోదావరి పోలీసుల షార్ట్ ఫిల్మ్ పోటీలు
తూర్పుగోదావరి జిల్లా పోలీసు శాఖ నిర్వహించిన షార్ట్ ఫిల్మ్ పోటీలకు అనూహ్య స్పందన లభించింది. రాష్ట్రంలోనే తొలిసారిగా సైబర్ క్రైమ్, యాంటీ డ్రగ్, ఉమెన్ & చిల్డ్రన్ విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీలకు 93 షార్ట్ ఫిల్మ్స్ అందాయి. వీటిలో 27 చిత్రాలు ఎంపిక కాగా, ఫైనల్‌కు 12 చేరుకున్నాయి. యాంటీ డ్రగ్ వినియోగం వల్ల జీవితాలు ఎలా విచ్ఛిన్నమవుతాయో అనే అంశంపై గౌతమ్ అద్యుత్ ప్రొడక్షన్స్ పతాకంపై జర్నలిస్ట్ సత్య నిర్మించిన ‘ఆపరేషన్–1972’ షార్ట్ ఫిల్మ్ మొదటి బహుమతి గెలుచుకుని రూ.10,000 నగదు బహుమతిని సాధించింది. విజేతలకు జిల్లా ఎస్పీ చేతుల మీదుగా మెమెంటోలు, సర్టిఫికెట్లు అందజేశారు.

సంబంధిత పోస్ట్